Guntur Kaaram Pre-release event cancel: సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, టాలీవుడ్ లేటెస్ట్ సెన్షేషన్ శ్రీలీల జంటగా నటిస్తున్న చిత్రం 'గుంటూరు కారం'(Guntur Kaaram). త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ జోరు పెంచింది మహేష్ టీం. అయితే గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జనవరి 06న హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్టు మేక‌ర్స్ ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే మహేష్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్ చెప్పారు మేకర్స్. ఫ్రీ రిలీజ్ వేడుకను వాయిదా వేసున్నట్లు తాజాగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది చిత్రయూనిట్. ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లోని యూసఫ్‌ గూడ పోలీస్‌ గ్రౌండ్‌లో భారీ ఎత్తున నిర్వహించేందుకు చిత్రబృందం ఫ్లాన్ చేసింది. అయితే భద్రతా కారణాల వల్ల ఈ వేడుకను క్యాన్సిల్ చేస్తున్నాం.. త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తాం అంటూ మేకర్స్ ట్వీట్ చేశారు. 



Also read: Suriya Gets Emotional: విజయకాంత్‌ సమాధి వద్ద బోరున విలపించిన హీరో సూర్య, వీడియో వైరల్


 అతడు, ఖలేజా సినిమా తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో గుంటూరు కారంపై వీర లెవల్లో అంచనాలు ఉన్నాయి. యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో శ్రీలీలతోపాటు మీనాక్షి చౌదరి కూడా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలు ఇప్పటికే పూర్తయ్యాయి. U/A సర్టిఫికేట్ కూడా లభించింది. ఏడో సారి సంక్రాంతి బరిలో నిలుస్తున్నాడు మహేష్. మ‌హేష్ గుంటూరు కారం మూవీ 159 నిమిషాల నిడివితో ప్రేక్ష‌కుల ముందుకురాబోతోంది. 


Also Read: Yatra 2 Teaser : ఆకట్టుకున్న ‘యాత్ర 2’ టీజర్.. మాట కోసం నిలబడ్డ తండ్రికి తగ్గ తనయుడి కథ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook